Wednesday, 4 November 2026

మండల కేంద్రంలో 3వ రోజు కి చేరిన రిలే నిరహార దీక్ష.

– దీక్షా శిబిరంలో నమాజ్ చేసిన ముస్లిం మహిళలు, పురుషులు.

బూర్గంపహాడ్ ఆగష్ట్21 (జనంసాక్షిిి) భద్రాద్రిి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో 3వ రోజు కి చేరిన రిలే నిరహార దీక్షలు బూర్గంపహడ్ మండలాన్ని పోలవరం ముంపు మండలంగా ప్రకటించి మెరుగైన ప్యాకేజ్ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం సమగ్ర పరిహారం ఇవ్వాలని కోరుతూ దీక్షలు కొనసాగుతున్నాయి. మూడవరోజు దీక్షలో 2వ వార్డ్ నుండి పాల్గొన్న ముస్లిం మహిళలుు పురుషులు పెద్ద ఎత్తున ఈ దీక్షలో పాల్గొని మధ్యాహ్నం ఒంటిగంటకు ఉపవాస దీక్షలో ఉండి కూడా ముంపు ప్రాంత పరిరక్షణకు ఎంతో నిష్టగా నమాజు చేయడం చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు, వ్యాపారస్తులు, అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది, వారి యొక్క నిబద్ధతకు, భక్తిశ్రద్ధలకు అందరూ జేజేలు పలుకారు. ఈ దీక్షలో పాల్గొన్న ముస్లిం మహిళలకు బూర్గంపహాడ్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ సెనగ సాయి ప్రత్యూష, కుంజా వెంకటరమణ పూలదండలు వేసి దీక్ష ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ నస్రిన్, మహమ్మద్ నజరీన్, ఎస్ కే జహీదా, ఎస్.కె ఫరీదా, ఎస్ కే సలీమా, ఎస్ కే రాబియా, ఆసియా బేగం, ఎండి జులేఖ, ఎస్ కే ఇంతియాజ్ ఎస్కే ఫాతి మునిస బేగం, తదితర ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో దీక్షలో పాల్గొన్నారు. ఈ క్రమంలో జేఏసీ కన్వీనర్ కె.వి రమణ, ప్రధాన కార్యదర్శి దామర శీను, సఫ్రాజ్ అలీ బాబా, పోలుకొండ ప్రభాకర్, భూపల్లి నరసింహారావు, జక్కం సుబ్రహ్మణ్యం, జక్కం శ్రీనివాసరావు, లక్కోజు విష్ణువర్ధన్, రాజేశ్వర్ రెడ్డి, దుద్దుకూరి రామకృష్ణ, బబ్బు రాయుడు, కన్నా శ్రీను, కనసాని పావని , మహిషాక్షి రామసీత, పెద్ద సంఖ్యలో ముస్లీం మహిళలు దీక్షలో పాల్గోన్నారు.