మంత్రిని కలిసిన మాల మహానాడు నాయకులు
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మేక వెంకన్న ఆధ్వర్యంలో
మాల మహానాడు జిల్లా కమిటీ నూతన అధ్యక్షులు అశోద రవి ఆ సంఘ సభ్యులతో క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మంత్రి నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు మినీ ట్యాంక్ బండ్ పై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 60 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని,ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానిక్ బిఆర్ అంబేద్కర్ పార్లమెంట్ గా నామకరణం చేయాలని కోరారు. మంత్రి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాజుల రాంబయమ్మ , పంగరక్క సంజయ్, చందా దాసు, అనుములపూరి శ్రీను, నాచు నాగయ్య ,పిట్టల భాగ్యమ్మ , బండ్ల రమేష్ , కట్ల మురళి ,ఆదిమల్ల భీష్మ, అనుముల బోస్ , బుల్లోద్ది వెంకటేశ్వర్లు, పెరుమాళ్ళ నాగయ్య, బుల్లెద్దు సామ్రాట్ , చింతమల్ల జ్యోతి , చందా దశరథ, కంచి సరిత , బొప్పాని అనిల్ , తుమ్మ కొమ్మ విజయ్, మద్దెల రాము తదితరులు పాల్గొన్నారు.