Tuesday, 3 November 2026

మట్టి గణపతులతోనే పర్యావరణ పరిరక్షణ

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):వినాయక నవరాత్రోత్సవాలలో భాగంగా మట్టి గణపతులనే ప్రతిష్టించి పూజిస్తే పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినవారవుతారని సాయి ఉమా ఫ్యాషన్ సెంటర్ నిర్వహకులు వాసా ఉమారాణి అన్నారు.బుధవారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక ఎంజీ రోడ్ లోని వారి షాప్ వద్ద మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.వాతావరణ కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు మట్టి వినాయకులనే పూజించాలని కోరారు.దాదాపు 200 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శబరినాథ్ , అనుశ్రీ , మహేష్ , బిందు తదితరులు పాల్గొన్నారు.