మడత వెంటే మా ప్రయాణం..
మడతే మాకు కొండంత అండ..
ఇల్లందు కొత్త కాలనీ వాసుల వెల్లడి..ఇల్లందు జులై 30 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ తోని మా ప్రయాణం కొనసాగుతుందని ఇల్లందు కొత్త కాలనీలో నివసిస్తున్న ఆర్ అండ్ ఆర్ కాలనీ వాసులు అన్నారు..
ఈ సందర్భంగా ఆదివారం కాలనీలో ఏర్పాటుచేసిన విస్తృతస్థాయి సమావేశనికి ముఖ్యఅతిథిగా మడత వెంకట్ గౌడ్ పాల్గొని మాట్లాడుతు.. గతంలో ఈ వార్డులలో గెలుపొందిన మున్సిపల్ కౌన్సిలర్లు నా మద్దతుతోనే గెలిచారనీ, నాకు మద్దతుగా ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికలలో కూడా నా మద్దతు దారులే గెలుస్తారనీ ఆశాభావం వ్యక్తం చేశారు. గెలిచినవారు వార్డుల అభివృద్ధికి పనిచేశారే తప్ప వారి స్వార్ధ ప్రయోజ
నాలకు పని చేయలేదన్నారు. ఆపదలో ఉన్నవారికి అండ
దండగా దండుసారయ్య నిలుస్తున్నారనీ,ఆయనను రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కచ్చితంగా ప్రజా మద్దతుతో మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిపిస్తాను అని అర్ అండ్ అర్ కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు నా హయాములో 120 కోట్ల నిధులు తీసుకొచ్చానని ఆ నిధులతోనే గడిచిన అభివృద్ధి పనులు ఇంకా జరుగుతు
న్నాయన్నారు. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఏనాడు పాకులాడాలేదని పట్టణంలోని 24 వార్డులలో నాకు ప్రజాబలం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రముఖులు దండు సారయ్య, మేకల నాగేష్, బొల్లి రాజు,వెంకటేష్,బన్సి,శేఖర్, ఉప్పరి సమ్మయ్య, మేకల లక్ష్మి,షాహిన్,ముంతాజ్,రాంబాయి మడత అభిమానులు పాల్గొన్నారు.