బిజినేపల్లి, సెప్టెంబరు 19. జనం సాక్షి .ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న చేప పిల్లలను సద్వినియోగం చేసుకొని మత్స్యకారులు మత్స్య సం పదతో ఆర్థికాభివృద్ధి సాధించాలని నాగర్ కర్నూల్ జిల్లా మత్స్యకార శాఖ అధికారి లక్ష్మప్ప అన్నారు. మండలంలోని మహాదేవునిపేట, నంది వడ్డెమాన్, బిజినేపల్లి గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో సోమవారం చేప పిల్లలను వదిలి మాట్లాడారు. చేపల వేట వృత్తిగా జీవనం సాగిస్తున్న మత్స్యకారులు చేపల పెంపకంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, మెళవకులు తెలుసుకొని మత్స్య సంపద పెంచ కోవాలన్నారు. అందుకు అవసరమైన సహాయ సహాకారాలు జిల్లా మత్స్యకార శాఖ అందిస్తుందన్నారు. కార్యక్రమంలో మండల వ మత్స్యకార సహకార సంఘం మండల అధ్యక్షుడు తుమ్మల ఆల్లోజ్. ప్రధాన కార్యదర్శి మస్కూరి బంగారయ్య, ఉపాధ్యక్షుడు సాప్పరి బాలస్వామి, కాశమోని రవి, శంకర్, వేమ వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.
Attachments area




