మధ్యాహ్న భోజన కార్మికుల బకాయిలు చెల్లించాలి

 

 

 

 

మునగాల, సెప్టెంబర్ 03(జనంసాక్షి): మధ్యాహ్న భోజన కార్మికుల నెలల తరబడి ఉన్న బకాయిలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని వివిధ పాఠశాలల మధ్యాహ్న భోజన కార్మికులను కలిసిన సందర్భంగా వారి సమస్యలపై స్పందిస్తూ కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి     రూ 15లు చొప్పున బడ్జెట్ కేటాయించాలని, కోడిగుడ్డుకు అదనపు బడ్జెట్ ను  కేటాయించాలని, లేదంటే అంగన్వాడి కేంద్రాలకు ఏ విధంగా అందిస్తుందో అదేవిధంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కందుల రాంబాయి, జల్లేపల్లి సుభద్ర, లక్ష్మి, సైదమ్మ, సువార్త, మంగమ్మ, ధనలక్ష్మి, ధనమ్మ, స్వప్న, సరోజన తదితరులు పాల్గొన్నారు.