హైదరాబాద్,డిసెంబర్29(జనంసాక్షి): గతనెలలో ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగాన్ని నిర్వహించిన తెలంగాణ సిఎం కెసిఆర్ మరో మహా యాగానికి సిద్ధమయ్యారు. జనవరి 21 నుండి 25 వరకు ఎర్రవల్లిలో ఉన్న తన ఫాంహౌస్లో రాష్ట్ర అభివృద్ధి కోసం ‘ మహారుద్ర సహిత సహస్ర చండీ మహా యాగం ‘ ను నిర్వహించనున్నారు. మాణిక్య సోమయాజి, నరేంద్ర కాప్రే, ఫణిశశాంక శర్మ, పురాణం మహేశ్వర శర్మ తదితరుల ఆధ్వర్యంలో ఈ యాగం చేపట్టనున్నారు. ఈ యాగంలో 200 మంది రుత్విక్కులు పాల్గొననున్నారు. యాగ నిర్వహణకు సంబంధించి మాణిక్య సోమయాజితో నిన్న కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. ఈ యాగానికి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మరో యాగానికి సిద్దం అవుతున్న సిఎం కెసిఆర్?




