నాంపల్లి ఆగస్టు (జనం సాక్షి ) విద్యార్థులు మహనీయుల మార్గంలో నడవాలని నాంపల్లి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జి.మోహన్ రావు సూచించారు. బుధవారం ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో కళాశాలలో 75వ స్వతంత్ర భారత వత్రోత్సవ ద్విసప్తాహ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మామిడి తోరణాలు, రంగు రంగుల కాగితాలలో కళాశాలను సుందరంగా అలంకరించారు. దేశ నాయకుల చిత్రపటాలను, పరిసరాలను పరిశుభ్రం చేశారు. త్రివర్ణ పతాకాలు చేతబూని నినాదాలు చేశారు. స్వాతంత్రోద్యమంలో దేశ నాయకులు చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఎం. వెంకన్న, ఇ. రజనీకాంత్, ఎస్.శ్రీనివాస్, కె. ముత్యాలు, ఎ. శిరీష, డి. కృష్ణ, కె. సైదయ్య, ఎన్. లక్ష్మిప్రసన్న, ఎస్వీ చారి, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
మహనీయుల మార్గంలో నడవాలి ప్రిన్సిపాల్




