హైదరాబాద్,ఆగస్ట్18(జనం సాక్షి): హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని ఆధునిక స్మశాన వాటిక మహా ప్రస్థానాన్ని బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ సందర్శించారు. స్మశాన వాటికలో కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్, ఫోనిక్స్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. మహా ప్రస్థాన విధానాలు ఎంతో అనుసరణీయంగా ఉన్నాయన్నారు సుశీల్ కుమార్ మోడీ. తమ రాష్ట్రంలో కూడా ఇలాంటి స్మశాన వాటికలను నిర్మిస్తామని చెప్పారు.




