మాజీ ఎమ్మెల్యే వి.రామారావు 55 వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు

దుప్పట్లు పంపిణీ చేసిన కుమారుడు విజయరామరాజు

కంటోన్మెంట్ జనం సాక్షి జూలై 31 కంటోన్మెంట్ నియోజకవర్గ మొట్టమొదటి మాజీ ఎమ్మెల్యే వి.రామారావు 55 వర్ధంతి సందర్భంగా సోమవారం నాడు బిజెపి సీనియర్ నాయకుడు వి.విజయరామరాజు ఆధ్వర్యంలో టికెట్ లక్ష్మీ నగర్ లో పేదలకు మున్సిపల్ కార్మికులకు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కార్పొరేటర్ కొంతం దీపిక, మాజీ ఎమ్మెల్యే శంకర్రావు కూతురు సుస్మిత, మన్నే శ్రీనివాస్, కపిల్ బరాబర్, రాయల్ కుమార్, బోర్డ్ నామినేటెడ్ సభ్యుడు జె.రామకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని దివంగత మాజీ ఎమ్మెల్యే వి.రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ రామారావు కంటోన్మెంట్ కు మొదటి ఎమ్మెల్యే గా ఉన్న రోజుల్లో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్ని కొనియాడారు.కార్యక్రమంలో సత్తిరెడ్డి,అల్లం నరేందర్,ప్రకాష్, విజయా నందు, వెంకటాచారి,రాజ మల్లేష్ బిజెపి శ్రేణులు పెద్ద సంఖ్యలోపాల్గొన్నారు.అనంతరం పేద ప్రజలకు మరియు పారిశుధ్య కార్మికులకు బ్లాంకెట్లను పంపిణీ చేశారు

తాజావార్తలు