Tuesday, 3 November 2026

మాదక ద్రవ్యాలకు బానిస కావొద్దు మీ జీవితాన్ని బలి చేసుకోవద్దు

.. స్టేషన్ ఘనపూర్ ఏసీపీ డి రఘుచందర్
స్టేషన్ ఘన్పూర్, జూలై 22 ,( జనం సాక్షి) :  గంజాయి, డ్రగ్స్, వంటి  మత్తు పదార్థాలకు విద్యా ర్థులు,యువత బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని స్టేషన్ ఘనపూర్ ఏసిపి డి రఘుచం దర్ అన్నారు. మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్,కాలేజ్ విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ రఘు చందర్ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ నేరాలుఅనగా  ఓఎల్ఎక్స్ ఫ్రవుడ్స్, లాటరీ టికెట్ ,బ్యాంక్ నుండి మాట్లాడుతున్నాం మీ యొక్క ఓటీపీ వివరాలను చెప్పండి అని అడగడం జరుగుతుంది కానీ  ఏ బ్యాంకు వాళ్లు కూడా మీ యొక్క వ్యక్తిగత వివరా లను అడగరని ఎవరికి షేర్ చేయకూడదని తెలి పారు. ఏదైనా నేరం జరిగినప్పుడు సైబర్ క్రైమ్ 1930 కాల్ చేయాలని అన్నారు. అదేవిధంగా మైనర్ వ్యక్తులు ఎవరు కూడా లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకూడదని,మీ యొక్క తల్లిదం డ్రులు బంధువులు రోడ్లపై ప్రయాణించేటప్పుడు విధిగా హెల్మెట్ ధరించాలని,ఇన్సూరెన్స్,వాహన పత్రాలను కలిగి ఉండాలని మీ తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించడం జరిగింది.ఏదైనా నేరం జరిగినప్పుడు100 డయల్ కి ఫోన్ చేయాల నీ అన్నారు. ఈ కార్యక్రమంలో  సిఐ  ఎడవల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ  శ్రీనివాస్  మోడల్ స్కూల్ ప్రిన్సిపల్  టీచర్స్, విద్యార్థులు పాల్గొనడం జరి గింది.