మాలల ఐక్యవేదిక కమిటీ వేసిన రాష్ట్ర అధ్యక్షుడు: బొల్లం మల్లేశం
ధర్మపురి అక్టోబర్ 20 ( జనం సాక్షి న్యూస్ )తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బొల్లం మల్లేశం,బుధవారం ఉదయం ధర్మపురి ఎస్ హెచ్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో అధ్యక్షతన మండల కమిటీ వేశామని పత్రికా ప్రకటన ద్వారా జనం సాక్షి మీడియాకు తెలుపుతూ, మండల అధ్యక్షుడిగా అనంతుల లక్ష్మణ్ ను ఎన్నుకోగా మరియు ఉపాధ్యక్షులుగా ఐదుగురికి అవకాశం ఇవ్వగా, గంధం సత్తయ్య, గుడిసెల రవికుమార్, కుంభాల రాజన్న, దాసండల రాజేశం,ముతూర్లు శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శిగా. కాళ్ల లచ్చయ్య, కార్యదర్శిగా అషది సత్యనారాయణ కోశాధికారిగా, ముత్తుర్ల సత్తయ్య, సంయుక్త కార్యదర్శిగా కండ్ల లక్ష్మణ్, సట్టు సాగర్, దాసనల్ల బాపు, దామెర గంగారాం, ప్రచార కార్యదర్శి గా జక్కుల రాజన్న,కాళ్ల జగన్ వీరికి అవకాశం ఇస్తూ, ధర్మపురి వేదిక నుండి జగిత్యాల జిల్లా కు మహిళా విభాగం అధ్యక్షురాలు గా దేవి అంజలిని,ప్రకటించామంటూ రాష్ట్ర అధ్యక్షుడు సూచిస్తూ, మాల కులస్తులు అందరూ ఒక తాటిపై నడవాలని ఎటువంటి సమస్యలు ఉన్న అధ్యక్షుల దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు అటు తరువాత రాష్ట్ర అధ్యక్షుడిని నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులను శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి మల్ల సత్యం, ఉపాధ్యక్షుడు వేణుగోపాల్, కోశాధికారి గుమ్మడి శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు రెడ్డి మల్ల తిరుపతి, యువజన రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి సురేష్, ధర్మపురి మండల జేఏసీ అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్ గౌడ్,ఎండపల్లి మండలాధ్యక్షుడు రెడ్డి మల్ల తిరుపతి, ఉపాధ్యక్షుడు బడికల అశోక్, వెల్గటూర్ మండల అధ్యక్షుడు గంధం నరసయ్య, మల్లాపూర్ సర్పంచ్ గంధం నారాయణ,ధర్మారం మండల కమిటీ సభ్యుడు గంధం రాజన్న, పెద్దపెల్లి జిల్లా సభ్యుడు కొప్పుల శ్రీధర్, మంత్రి రమేష్.మరియు ధర్మపురి మండల సర్పంచులు ఎంపీటీసీలు వివిధ గ్రామాల నాయకులు మరియు కులస్తులు తదితరులు పాల్గొన్నారు.