మావోయిస్టులు తమ ఉనికి కోసం ప్రయత్నిస్తున్నారు.

పసర సీఐ.శంకర్

ములుగు జిల్లా
గోవిందరావుపేట సెప్టెంబర్ 8 (జనం సాక్షి):-

తెలంగాణలో మావోయిస్టులు తమ ఉనికి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనీ పసర సీఐ శంకర్ అన్నారు. గురువారం మండలంలోని పసర పోలీస్ స్టేషన్లో సిఐ శంకర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏజన్సీ ప్రాంతంలో లో ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు అడ్డు
పడుతూ ఆది వాసీలకు ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మావోయిస్టులు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నారన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు గిరిజన యువతి యువకులు ప్రజలలో అనేక అపోహలు సృష్టించి వారి సాధారణ జీవనానికి విఘాతం కలిగిస్టున్నరన్నరు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం మావోయిస్టు భావజాలాన్ని వారికి అంటగడుతూ అజెండా ముసుగులో ప్రజలను, యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. మావోయిస్టు కార్యకలాపాలలో పాల్గొన్న వారికి ఎవరైనాను ఎటువంటి సహాయం చేసిన యెడల వారు చట్టప్రకరం శిక్షార్హులని అన్నారు. ప్రజలు ఇటువంటి వారి అపోహలకు మాయమాటలకు ఆకర్షితులు కావద్దని వారి కుటుంబ జీవితాన్ని అంధకారం చేసుకోవద్దని సూచించారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలు మావోయిస్టు పార్టీ ప్రకటనలకు భయపడకుండా సాధారణ జీవితం గడుపుతు మావోయిస్టు పార్టీ గురించి గాని పార్టీ నాయకుల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే పోలీసు వారికి తెలుపవలెనన్నారు.తెలిపిన వారి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.