మా భూమిని కాపాడండి పాఠశాలను రక్షించండి.
పాఠశాల ప్రిన్సిపాల్ ఫాదర్ ఆరోగ్య రెడ్డి.
తాండూరు సెప్టెంబర్ 10(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సెయింట్ మాక్స్ హైస్కూల్ ప్రహరీ గోడ కూల్చారని శనివారం పాఠశాల టీచర్స్, ఉపాద్యాయులు విద్యార్థుల తో కలసీ ప్లాకార్డ్స్ తో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఫాదర్ ఆరోగ్య రెడ్డి మాట్లాడుతూ 128 సర్వే నంలో ఉన్న భూమి విషయంలో పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు.ఓ వ్యక్తి 28 అగష్టు రోజు ప్రహరీ గోడను దౌర్జన్యంతో కూల్చి వేశారని తమ అనుచరులతో మాపై దాడి చేశారని పేర్కొన్నారు .పోలీసులకు కంప్లైంట్ చేసిన ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం ఎమిటన్నారు.ప్రహరీ గోడ కూల్చడమే కాకుండా మాపై కేసులు నామోదు చేశారని తెలిపారు.ఈ విషయమై రాష్ట్ర మంత్రి హరీష్ రావుకు వినతి పత్రం అందజేశామని పేర్కొన్నారు .అదేవిధంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లామ ని తెలిపారు. మాభూమి మాహక్కు.న్యాయంగా పోరాడుతాం..అక్రమాన్ని అపుతాం….ఈ భూమి ఒక సంస్థకు చెందినది ఓ వ్యక్తి కి చెందింది. మా భూమిని కాపాడండి పాఠశాలను రక్షించండి, నిజం నిప్పులాంటిది మా భూమి జోలికి వస్తే తీవ్ర ఇబ్బంది ఎదురు కోవడం తప్పదన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల టిచర్లు,ఉపాద్యాయులు , విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.