పాపన్నపేట, డిసెంబర్19( జనం సాక్షి); పాపన్నపేట మండల పరిధిలోని మిన్ పూర్ గ్రామంలో గురువారం నాడు పాపన్నపేట మండల ఏ ఈ ఓ రజిత రైతులకు వర్మీ కంపోస్ట్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్మీ కంపోస్ట్ ను ఎలా తయారు చేయాలో రైతులకు వివరించారు సేంద్రియ ఎరువులతో పండించిన ఆహార ఉత్పత్తులను తినడం మూలంగా ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఇందులో నత్రజని, భాస్వరం, ఫొటోస్ ఎరువుల కంటే అధిక మోతాదులో ఉన్నందున రైతులందరూ రసాయన రసాయనిక ఎరువుల మోతాదు తగ్గించి సేంద్రీయ ఎరువులను వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరి లింగారెడ్డి రైతులు పాల్గొన్నారు.




