హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాసేపట్లో హైదరాబాద్ మెట్రోరైలును ప్రారంభించనున్నారు. ఇందుకోసం బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన మియాపూర్‌కు వాయుసేనకు చెందిన హెలికాప్టర్‌లో చేరుకున్నారు. ఆయన వెంట గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. ఈ సందర్భంగా మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద పలువురు తెలంగాణ మంత్రులు, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ప్రధానికి ఘనస్వాగతం పలికారు.