ముఖ్యమంత్రి చేసిన యాగం వల్లే నిండిన చెరువులు-ఎమ్మెల్యే మదన్ రెడ్డి

జనం సాక్షి/ కొల్చారం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి పర్యటించారు భారీ వర్షాలకు చెరువులు కుంటలు నిండి అలుగు పారుతుండడంతో స్థానిక కోతుల చెరువు వద్ద ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు కరువు కాటకాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన యాగం వల్ల నేడు తెలంగాణ రాష్ట్రంలో కరువు కాటకాలు లేకుండా పోయాయని ప్రతి సంవత్సరం భారీ వర్షాలతో చెరువులు కుంటలు నుండి రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా ఉంటున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌర్శంకర్ గుప్తా, ఉప సర్పంచ్ నింగుల్ల చెన్నయ్య, సొసైటీ చైర్మన్ నాగూర్ మనోహర్, బి ఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎండుగుల కృష్ణ, గ్రామ శాఖ అధ్యక్షులు దుర్గ ప్రసాద్ గౌడ్, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్, నర్సాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ అశోక్ గౌడ్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఖదీర్, మెదక్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రాజా గౌడ్, ఏడుపాయల మాజీ డైరెక్టర్ నంగునూరు గౌరీ శంకర్ గుప్తా, మాజీ అధ్యక్షుడు నేరెళ్ల చంటయ్య, మత్స్య సంఘం సభ్యులు దొంకెన మల్లయ్య, పాండ్ర వెంకటేశం, కారోబార్ ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

తాజావార్తలు