ముఖ్యమంత్రి సహాయ నిధి తో పేద ప్రజలకు మెరుగైన వైద్యం వైద్య సేవలు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”
వికారాబాద్ రూరల్ జూలై 22 జనం సాక్షి
ముఖ్యమంత్రి సహాయ నిధి తో నిరుపేద ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని వికారాబాద్ జిల్లా, అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు శనివారం”ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన రూపాయలు.3,20,000 మూడు లక్షల ఇరవై వేలు విలువ గల 10 చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ చెక్కులు పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో మోమిన్ పేట పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మర్పల్లి మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.