ముగ్గురు నకీలీ నక్సల్స్‌ అరెస్టు

హైదరాబాద్‌: అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు నకిలీ నక్సల్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ముగ్గురు ఎస్‌. ఆర్‌. నగర్‌లో నివసించే చంద్రశేఖర్‌ అనే ఓబిల్డర్‌కు కొండపల్లి సీతారామయ్య పేరుతో లేఖరాసి రూ. 15 లక్షలు డిమాండ్‌ వ్యక్తం చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు పక్కా ప్రణాళికతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.