మూసివేసిన చక్కర ఫ్యాక్టరీ ప్రారంభించాలని పెద్దమ్మ తల్లికి బోనాలు

సి ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోనాలు

మల్లాపూర్ (జనంసాక్షి) ఆగస్టు:28 మండల కేంద్రంలోని ముత్యంపేట నిజాం చెక్కర ఫ్యాక్టరీని ప్రారంభించాలని ఆదివారం సి ఎస్ ఆర్ ఫౌండేషన్ అధినేత చెన్నమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. ఉదయం 9 గంటలకు చక్కర కర్మాగారం ప్రధాన ద్వారం ముందర నాడు చక్కర కర్మాగారం రావడానికి కృషి చేసిన ముత్యంపేట గ్రామానికి చెందిన మాజీ మంత్రి స్వర్గీయ వర్ధినేని వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం చక్కెర కర్మగారం నుండి ముత్యంపేట పెద్దమ్మ తల్లి దేవాలయానికి రెండు కిలోమీటర్ల మేర మహిళలు బోనాలతో నడుచుకుంటూ వెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో చెరుకు ఉత్పత్తిదారులసంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి ముందుండి నడిపించాడు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,జువ్వాడి కృ ష్ణారావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమా, బిజెపి నాయకులు సురభి నవీన్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు చెరుకు రైతులు రైతు సోదరులు మహిళలు పాల్గొన్నారు.