మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన : ఇటికాల చిరంజీవి
మోత్కూరు అక్టోబర్ 8 జనంసాక్షి : మోత్కూర్ మండల పరిధిలోని దాచారం గ్రామంలో సురారం నర్సింహ (45) అకాల మరణం చెందగా వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి అనంతరం వారి కుటుంబ సభ్యులకు రూ.5000/- ఆర్థిక సహాయం అందజేసిన ఉమ్మడి నల్గొండ జిల్లా టెలికామ్ అడ్వైజర్ కమిటీ మెంబర్ టీపీసీసీ రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి. వారితో పాటు ఈ కార్యక్రమంలో మోత్కూర్ పిఎసిఎస్ డైరెక్టర్ ఆకుల వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ సురారం యాదగిరి, గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రవి, తుంగతుర్తి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సూరారం నవీన్ కుమార్, రాపాక డి.గ్రామశాఖ అధ్యక్షులు చిప్పలపల్లి పరుశరాములు, గ్రామ యూత్ కాంగ్రెస్ నాయకులు తాటిపాముల మహేష్, సురారం అశోక్, రాజు, సురారం నవీన్, తదితరులు పాల్గొన్నారు.