మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్.పి డా.శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని
జిల్లా పోలీసు కార్యాలయం,
మెదక్ జిల్లా.
– 17.09.2022.
జనం సాక్షి ప్రతినిధి మెదక్
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్.పి డా.శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్ గారు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. మెదక్ డి.యెస్.పి శ్రీ.సైదులు గారు, ఎస్.బి. సి.ఐ.శ్రీ.నవీన్ బాబు, సి.ఐ గోపీనాథ్ గారు,ఎస్.బి. ఎస్.ఐ.శ్రీ. సందీప్ రెడ్డి గారు, డి.పి.ఓ. సిబ్బంది, ఎస్.బి. సిబ్బంది, డి.సి.ఆర్.బి. సిబ్బంది మరియు ఐ.టి. కోర్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే జిల్లా ఎస్.పి.శ్రీమతి రోహిణి ప్రియదర్శిని.ఐ.పి.ఎస్ గారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ సందర్భంగా గౌరవనీయులు శ్రీ.తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ హరీష్ గారు మెదక్ ఎంఎల్‌ఏ శ్రీమతి పద్మదేవేందర్ రెడ్డి గారు, అదనపు కలెక్టర్ శ్రీమతి ప్రతిమ సింగ్ గారు, శ్రీ.శేరి సుబాష్ రెడ్డి ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ గారి రాజకీయ కార్యదర్శి, గారితో యుక్తంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.