యువ భారత్ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
అశ్వారావుపేట, సెప్టెంబర్ 15( జనం సాక్షి )
అశ్వారావుపేట మండలంలోని గాండ్లగూడం గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన మాలోతు రమాదేవి కి చిన్నతనం నుండి తలసేమియాతో బాధపడుతుంది ప్రస్తుతం గర్భవతి హాస్పిటల్లో చికిత్స పొందటానికి ఆర్థిక స్తోమత లేక సహాయం కోసం ఎదురుచూస్తున్న విషయాన్ని తెలుసుకున్న యువ భారత్ శక్తి ఫౌండేషన్ అందరి సహాయ సహకారాలతో సోషల్ మీడియా ద్వారా దాతల సహాయ సహకారాలతో రూ 15,000 ఫండింగ్ చేసి రమాదేవి భర్త రవితేజ కి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఇంఛార్జి మునుకోటి శ్రీనివాసరావు , జనసెన ఖమ్మం జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు డేగల రామచంద్రరావు మరియు విత్తం రామ్‌కుమార్ దామెర బాబి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా డేగల రామచంద్రరావు మాట్లాడుతూ చాలామంది తల సేమియా వ్యాధితో బాధపడుతున్నారని, ఈ వ్యాధిని నిర్మూలించడం మనందరి చేతిలో ఉందని , అలాగే రమాదేవి కోసం సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు