రక్తదానం చేసిన యువమోర్చా నాయకులు

మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్17(జనంసాక్షి)

భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సంధర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్వీ కళాశాలలో యువమోర్చా జిల్లా అధ్యక్షులు సిరికొండ సంపత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో యువమోర్చా గార్ల మండల అధ్యక్షులు ఎడ్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో గార్ల మండల యువమోర్చా నాయకులు భారీగా పాల్గొని రక్తదానం చేశారు. శేఖర్ మాట్లాడుతూ దేశ అభివృద్ధి ప్రదాత మోడీ జన్మదిన వేడుకలను వృధా ఖర్చులతో జరపకుండా కొన్ని వందలమంది ప్రాణాలకు బరోసానిస్తూ జిల్లా అధ్యక్షులు సిరికొండ సంపత్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం గర్వకారణమని ప్రతీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులతో పాటు గార్ల మండల నాయకులు ఠాకూర్ యశ్వంత్ ప్రసాద్, బుడిమే సందీప్, షేక్ ఈజాస్, మార్గం రాజు, ఎడ్ల రాజు, మేకల సందీప్, దుడ్డేల పవన్, రాము, పిడమర్తి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Attachments area