రహదారి ప్రమాదాలను తగ్గించడానికి ఉచిత కంటి వైద్య శిబిరాలు

:* జి.యం.ఆర్ పోచంపల్లి ఎక్సప్రెస్ వేస్ లిమిటెడ్ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటరమణ తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 21:: జాతీయ రహదారిపై
ప్రమాదాల నిష్పత్తిని తగ్గించడానికి , జాతీయ రహదారులపై సురక్షితమైన డ్రైవింగ్‌ను నిర్ధారించే ప్రయత్నంలో నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆదేశాలమేరకు జి.యం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్, జి.యం.ఆర్ పోచంపల్లి ఎక్సప్రెస్ వేస్ లిమిటెడ్ మరియు పుష్పగిరి కంటి ఆసుపత్రి సహకారంతో
నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు జిఎంఆర్ పోచంపల్లి ఎక్స్ప్రెస్ వేస్ లిమిటెడ్ ప్రాజెక్టు మేనేజర్ వెంకటరమణ పేర్కొన్నారు జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికీ అద్దాలను అందజేశారు. జి.యం.ఆర్ పోచంపల్లి ఎక్సప్రెస్ వేస్ లిమిటెడ్ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటరమణ మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా జి.యం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జి.యం.ఆర్ సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేసారు. జి.యం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ప్రతినిధి శ్రీనివాస్ మాట్లాడుతూ అవగాహన లోపం కారణంగా చాలా మంది డ్రైవర్లు సంవత్సరానికి ఒకసారి కూడా కంటి పరీక్షలు చేయించుకోవడం విస్మరిస్తున్నారని, రోడ్డు ప్రమాదాలకు కంటిచూపు మందగించడం కూడా కారణమని తెలియజేసారు. పుష్పగిరి కంటి ఆసుపత్రి వైద్యులు వేణుప్రసాద్ , ఉమెర్, మరియు సాగర్ ఆధ్వర్యంలో దాదాపుగా 150 మంది డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి, 80 మంది డ్రైవర్లకు కళ్ళ జోళ్ళు పంపిణీచేశారు. అలాగే 12 మందికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్స అవసరమని నిర్ధారించారు. వీరికి పుష్పగిరి కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్ చేయబడునని కోఆర్డినేటర్ వేణు ప్రసాద్ తెలిపారు. ఈ జి.యం.ఆర్ సంస్థ ప్రతినిధులు, రక్ష సిబ్బంది, జి.యం.ఆర్.ఐ.టి రాజాం కళాశాల విద్యార్థులు, పుష్పగిరి కంటి ఆసుపత్రి సిబ్బంది మరియు డ్రైవర్లు పాల్గొన్నారు.