రాజీవగాంధీ జయంతి వేడుకలకి మహేశ్వర్ రెడ్డి

ఆగస్టు 20(జనం సాక్షి ) మండలoలోని  మాసాయి పెట్ గ్రామం లో రాజీవగాంధీ జయంతి వేడుకలకి ఏ.ఐ సి.సి  అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాజరై మాజీ ప్రధాని రాజీవగాంధీ విగ్రహం కి కడం మండల కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధాని గా ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలకి మేలు చేసారు అని వారి హయం లో మొబైల్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ కమ్యూనికేషన్ సిస్టమ్ ని చేసిన ఘనత రాజీవగాంధీ ది అని ఆయన దేశానికి  చేసిన సేవలని కొనియాడారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు పొద్దుటూరి సతీష్ రెడ్డి జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి షేక్ రఫీక్ దిల్వార్పూర్ జడ్పీటీసీ తక్కళ్ళ రమణ రెడ్డి నాయకులు బాపురెడ్డి   కడం టౌన్ ప్రెసిడెంట్ వాజీద్ ఖాన్   సలీం   సత్యంచంద్రకాంత్ జమాల్ రహీం     మౌర్య సత్యం చారి నరేష్ అశోక్ లచ్చన్న మరియు గ్రామస్తులు పాల్గొన్నారు