రాబోయే తరాల మేలు కోసం మట్టి వినాయకుడిని ప్రతిష్టించి పూజించాలి.

ఎకో ఫ్రెండ్లీ (పర్యావరణ అనుకూల) గణేష్ మండపాలు నిర్వాహకులకు సన్మానం.
జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు. తాండూర్ బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి.
తాండూరు సెప్టెంబర్ 3(జనంసాక్షి)వినాయక చవితి సందర్భంగా తాండూరు పట్టణంలో వివిధ ప్రాంతాలు సిసిఐ కాలనీ సౌకార్పేట్ కాళికాదేవి ఆలయ ఆవరణంలో మాణిక్నగర్ హరిజనవాడ వివిహెచ్ఎస్ స్కూల్ రోడ్ అంబేద్కర్ చౌక్ లో ఏర్పాటుచేసిన ఎకో ఫ్రెండ్లీ వినాయక మండపాలను శనివారం ఉదయం జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి మట్టి గణనాథులను ఏర్పాటుచేసిన నిర్వాహకులను శాలువాలతో అభినందించారు.ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ మట్టి వినాయకులనే పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం కులవృత్తుల వారికి చేయూతనిద్దాం అనే నినాదంతో గత రెండు సంవత్సరాల నుండి బీసీ సంఘం ఆధ్వర్యంలో హిందూ సేవా సమితి నాయకులకు వినాయక మండపం నిర్వాహకులకు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాం మట్టి వినాయకులను ఏర్పాటు చేసే విధంగా పాలకులు నాయకులు అధికారులు అవగాహన కల్పించాలని కోరారు.ఈ సంవత్సరం తాండూరు ప్రాంతంలో ఎప్పుడు లేని విధంగా రకరకాలుగా మట్టి వినాయకులను ఏర్పాటు చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని వచ్చే ఏడాది ఇప్పుడు ఏర్పాటు చేసిన ఎకో-ఫ్రెండ్లీ వినాయకుల నిర్వాహకులను ఆదర్శంగా తీసుకొని ప్రతి ప్రాంతంలో మట్టి వినాయకులను ఏర్పాటు చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ నాయకులు గడ్డం వెంకటేష్ ,బీసీ మహిళా తాండూర్ నియోజకవర్గ అధ్యక్షురాలు నాకుడి జ్యోతి ,బిసి మీడియాసెల్ ఇన్ఛార్జి బసవరాజ్ ,బహుజన యువ నాయకులు రాము ముదిరాజ్, జూటుపల్లి వెంకట్ ,మంజుల సురేంద్ర మాదేవ్, తదితరులు పాల్గొని నిర్వాహకులను అభినందించారు.