రాయిపల్లి గౌడ సంఘం అధ్యక్షుడు అయిల కృష్ణ గౌడ్ ని ఘనంగా సన్మానించిన గౌడ సంఘం రాష్ట్ర నాయకులు బీసు చందర్ గౌడ్

ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 16 (జనంసాక్షి) మండల పరిధిలోని రాయిపల్లి గ్రామ కల్లుగీత పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు అయిల కృష్ణగౌడ్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా గౌడ సంఘం రాష్ట్ర నాయకులు బీసు చందర్ గౌడ్ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మన గీత కార్మికులు ఐక్యమత్యంగా ఉండి మన హక్కుల కోసం పోరాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మరియు కీ”శే శ్రీ బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ ఆశయాలను సాధించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కల్లు గీత కార్మిక పారిశ్రామిక సహకార సంఘం మండల గౌరవ అధ్యక్షులు గడ్డం దశరథ గౌడ్ రాయిపల్లి గ్రామ సర్పంచ్ పంజాల సుమతి శ్రీనివాస్ గౌడ్ గౌడ సంఘం జిల్లా నాయకులు పంజాల వెంకటేష్ గౌడ్ సిద్ధులు గౌడ్ ముద్దసాని అంజయ్య గౌడ్ రామకృష్ణ గౌడ్ పరకాల రాములు గౌడ్ నాతి బిక్షపతి గౌడ్ గాజుల సిద్దులు గౌడ్ మరియు గీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు