రుద్రంగి సెప్టెంబర్ 1 (జనం సాక్షి);
ఏ శుభకార్యం చేసిన ముందుగా తొలి పూజలు అందుకునే దేవుడు వినాయకుడు కావడంతో వినాయక చవితి సందర్భంగా పలుచోట్ల ఏర్పాటుచేసిన వినాయక మండపాల వద్ద పూజా కార్యక్రమాలతో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు.ఉరేగింపుగా వినాయక విగ్రహాలను తీసుకవచ్చి మండపాలలో
ప్రతిష్ఠించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. కాగా మండల కేంద్రంలోని మహాలక్ష్మి యూత్, హనుమాన్ యూత్,యాంగ్ వండర్స్ యూత్,
సర్వజన గణేష్ యూత్,ఆదర్శ యూత్,సాయి నగర్ యూత్,బార్న్ ట్ రూల్ యూత్,
ఎస్ఆర్ఆర్ యూత్,రెడ్డీస్ యూత్,పాటేల్స్ యూత్,రెడ్డి నగర్,శ్రీ నగర్ యూత్ ఆధ్వర్యంలో గణనాథుడిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు.వినాయకుడి కృపాకటాక్షాలతో ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులు సజావుగా సాగాలని ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని పూజలు నిర్వహించినట్టు నిర్వాహకులు భక్తులు తెలిపారు.
రుద్రంగి లో కొలువుదీరిన గణనాథులు




