రెండు పడకల ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన సర్పంచ్
జుక్కల్ ,ఆగస్టు25,జనంసాక్షి,
కామారెడ్డి జిల్లా పెద్దకొడపగల్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న రెండుపడకల ఇళ్లను స్థానిక సర్పంచ్ తిరుమల్ రెడ్డి,సింగిల్ విండో చైర్మన్ హన్మంత్ రెడ్డిలు గురువారం పరిశీలించారు. ఈ సందర్బంగా వారు లబ్దిదారులతో మాట్లాడుతు ఇళ్లను పటిష్టంగా నిర్మించుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు తగు సూచనలు సలహాలు అందించారు. నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించడానికి తమ వంతు కృషిచేస్తామని తెలిపారు. పెద్ద కొడప్ గల్ గ్రామానికి 50 రెండుపడకల ఇళ్లను ప్రభుత్వం మంజూరి చేసిందని సర్పంచ్ తెలిపారు. ఈ ఇళ్లను లబ్దిదారులే నిర్మించుకుంటున్నారని ఆయన తెలిపారు.