అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 19
అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ సెలెక్ట్ టాకీస్ నుండి సుచిత్ర వెళ్లే దారిలో సుబ్బారావు టీ స్టాల్ పక్కన రాజి రెస్టారెంట్ ను స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రెస్టారెంట్ నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
నగరం రోజురోజుకీ అభివృద్ధి చెందుతుందని ఇలాంటి రెస్టారెంట్ల ఆవశ్యకత ఉందన్నారు. ప్రజలు తమ దైనందిన జీవితంలో భాగంగా వారంలో ఒక్కసారైనా కుటుంబంతో కలిసి రెస్టారెంట్ కువస్తారనివారినిదృష్టిలో ఉంచుకొని మెరుగైనసేవలుకల్పించాలన్నారు.రె స్టారెంట్ నిర్వాహకులు ప్రజలకు అనుకూలంగా రుచికరమైన నాన్ వెజ్ అరేబియన్ మండి తరహాలో అందిస్తామని నిర్వాహకులు రాజి, సమీర్, తెలిపారు.ఈకార్యక్రమంలో స్థానిక నాయకులు సూర్య కిరణ్, రాజసింహారెడ్డి, బలవంత రెడ్డి, నాగేశ్వరరావు, శ్రీశైలం యాదవ్, శ్రవణ్ ముదిరాజ్, మధుసూదన్ రెడ్డి, అతిక్, పాష, మధు, తదితరులు పాల్గొన్నారు.




