రేపు భగలాముఖి శక్తిపీఠంలో లక్ష హరిద్రార్చన ప్రపంచస్థాయిలో ఈ శక్తిపీఠానికి ప్రత్యేక గుర్తింపు
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివిధ స్థాయిల ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు
శివ్వంపేట ఆగస్ట్ 12 జనంసాక్షి : భగలాముఖి శక్తిపీఠము ఎంత ప్రభావంతమైనదో ఎంత శక్తివంతమైనదో ఎంత ప్రాచుర్యం కలిగినదో మాటల్లో చెప్పలేనిదని అమ్మవారి ఉపా సకులు శక్తిపీఠం ట్రస్టు సభ్యులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ పేర్కొన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 14న భగలాముఖి శక్తిపీఠం ఆవరణలో కన్నుల పండుగ జరగనున్న లక్ష ఆరిద్రార్చన కార్యక్రమం నిర్వహణ తీరుతెన్నులపై ఆయన శుక్రవారం వివరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ కొన్ని వేల మంది భక్తులు అమ్మ అనుగ్రహాన్ని పొంది ఈరోజు ఆనందంగా జీవిస్తున్నారన్నారు. అంతేకాదు మన తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా అమ్మవారి అనుగ్రహం పొందిన వారిలో ఒకరని ఆయన నిశదీకరించారు. ఆయన స్వయంగా నేను అమ్మవారి దర్శనానికి సకుటుంబంగా వస్తానని, అమ్మవారి లక్ష హరిద్రార్చన కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడానికి ఆదివారం ఉదయం 10 గంటలకు మన శక్తి పీఠానికి వస్తున్నట్లు చెప్పారు. అలాగే శాసనసభ్యులు మదన్ రెడ్డి స్త్రీ శిశు సంక్షేమ ఛైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, ఫారెస్ట్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రముఖులు, జిల్లా, మండల వివిధ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు వస్తున్నారని, మనందరం కలిసి ఈ భగవత్ కార్యాన్ని విజయవంతం చేయాల్సిందిగా స్థానిక జడ్పిటిసి పబ్బా మహేష్ గుప్తా కూడా కోరారు.