రేషన్ షాపులపై విజిలెన్స్ ఆఫీసర్ల తనికీలు ..!

స్టాక్ డిటైల్స్…టైమింగ్స్ పై వివరాల సేకరణ ..!
మిర్యాలగూడ, జనం సాక్షి
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని పలు రేషన్ షాపులపై మంగళవారం ఉమ్మడి నల్గొండ విజిలెన్స్ టీం స్థానిక ఆఫీసర్లతో కలిసి ఆకస్మిక తనికీలు చేపట్టింది. సుమారు ఉదయం 11 గంటల ప్రాంతంలో తనికీలను ప్రారంభించిన విజిలెన్స్ టీం అధికారులు మధ్యాహ్నాం వరకు కొనసాగించారు. గాంధీనగర్ లోని రేషన్ షాపు_2, రిజిస్ర్టేషన్ ఆఫీస్, శివాలయం సమీపంలోని 26,27, అదే విధంగా అశోక్ నగర్ రేషన్ దుకాణం 30లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఆఫీసర్లు మాట్లాడారు. రేషన్ పొందిన లబ్ధిదారుల, షాప్ లో ఉన్న స్టాక్ డిటేల్స్ తీసుకున్నామన్నారు. షాపుల నిర్వహణలో టైమింగ్స్ మెయింటెన్ చేయాలని సూచించారు. ప్రస్తుతం తనికీలు చేపట్టిన దుకాణాల్లో గుర్తించిన స్టాక్ , ఇతర వివరాల నివేదికను ప్రభుత్వానికి అందిస్తామన్నారు. తనికీల్లో విజిలెన్స్ సీఐ మహేష్, ఎస్ ఐ గౌస్, కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి, డీటీ రామకృష్ణారెడ్డి, ఆర్ఐ సురేందర్ సింగ్ తదితరులున్నారు.