Tuesday, 3 November 2026

రైతాంగాన్ని దివాలా తీయిస్తున్న మోడీ ప్రభుత్వం…

తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకన్న
కేసముద్రం సెప్టెంబర్ 1 జనం సాక్షి / గురువారం మండల కేంద్రంలోని హరిహర గార్డెన్ లో తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షులు కావటి నరసయ్య అధ్యక్షతన జరిగిన  సమావేశానికి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకన్న పాల్గొని మాట్లాడుతూ…   కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత రైతు ,ప్రజా,కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ రైతాంగాన్ని కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టాలని చూస్తుందని అన్నారు.మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాలు నెరవేర్చకపోగా ప్రజలపై అనేక భారాలు మోపుతూ దేశ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.రైతే రాజు రైతే దేశానికి వెన్నుముక అని సభలలో మాట్లాడిన దానికి చేసే పనికి తేడా లేకుండా పోయిందని,నీతులు పలికిన నేతలు రైతులను నట్టేట ముంచే నల్ల చట్టాలను తెచ్చి రైతులు లేకుండా చేస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యపట్టారు.రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం పోడు రైతులకు పట్టాలు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.కౌలు రైతులను ఆదుకోవాలని పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని పోడు రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు.ఇప్పటికైనా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేనియెడల ప్రజలే పాలకులకు బుద్ధి చెప్తారని అగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గునిగంటి రాజన్న,తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు మార్తినేని పాపారావు,తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి బొబ్బల యాకుబ్ రెడ్డి ,రైతు సంఘం మండల కమిటీ సభ్యులు నీరుటి జలంధర్, మోడెం వెంకటేశ్వర్లు, సిఐటియు మండల కార్యదర్శి జల్లే జయరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.