Wednesday, 4 November 2026

రైతులు పశువుల్లో వచ్చేటువంటి లంపి స్కిన్ వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలని మామునూరు కృ

రైతులు పశువుల్లో వచ్చేటువంటి లంపి స్కిన్ వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలని మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ రాజన్న సూచించారు ప్రస్తుతం ఈ వ్యాధి ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో పశువులకు చోకి విపరీతమైనటువంటి ప్రాణ నష్టాన్ని కలుగజేస్తోంది కాబట్టి రైతులు పశువుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తూ ఈ లంపి స్కిన్ అనే వైరస్ రోగం పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు ఈ వ్యాధి కాప్రి వైరస్ వలన వస్తుంది. ఇది మొదటగా జాంబియా దేశంలో 1929లో గుర్తించడం జరిగింది. అదేవిధంగా మనదేశంలో 2019లో ఒరిస్సా రాష్ట్రంలో మొదటిసారి దీన్ని గుర్తించడం జరిగింది. ఈ వ్యాధి సోకిన పశువులు ఎక్కువగా జ్వరంతో బాధపడుతుంటాయి జ్వరము 40° నుంచి 42 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. ఈ జ్వరం తీవ్రత వచ్చిన తర్వాత శరీరం పైన నాలుగు నుంచి ఐదు రోజుల్లో బొడిపెలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముక్కు, కళ్ళ నుంచి ద్రవాలు కారడంతో పాటు శరీరం పైన బొడుపులు కురుపులు దద్దులు ఏర్పడతాయి. తద్వారా వ్యాధి నిరోధక శక్తి క్షీణించి నడవలేని స్థితికి చేరుకుంటాయి వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ శరీరంపై ఏర్పడినటువంటి మసూచి లాంటి కురుపులు పగిలి పుండ్లుగా మారి రంద్రాలు ఏర్పడతాయి. ఈగలు దోమలు, గోమార్లు, పిడుదులు ఇతర క్రిమి కీటకాల వలన ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పాలిచ్చే జీవుల్లో పాల ఉత్పత్తి తగ్గిపోతుంది అదే విధంగా చూడి పశువులు ఈడ్చుక పోవడం జరుగుతుంది. ఈ లక్షణాలు గుర్తించిన వెంటనే రైతులు పశువైద్యల యొక్క సహకారంతో చికిత్స కొనసాగించాలి ఈ చికిత్స కొరకు ముఖ్యంగా పారాసిటమాల్, ఏదైనా యాంటీబయోటిక్ మందులను వాడుకోవాల్సి ఉంటుంది లేదా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే corticosteroid మందుల్ని కూడా తగు మోతాదులో వాడుకోవాలి వ్యాధి నివారణకు గోట్ పాక్స్ టీకాను ఒక మిల్లీ లీటర్ చర్మం కింద ఇప్పించాలి. ఇదే కాకుండా రైతులు ఇతర రాష్ట్రాల నుంచి పశువులను కోంటే వాటిని సుమారుగా ఒక ఏడు రోజులు మందలో తిరగనీయకుండా క్వారంటైన్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఏదైనా పశువుల్లో వ్యాధి లక్షణాలను గమనించినట్లయితే సుమారుగా 15 రోజులపాటు ఈ క్వారంటైన్ ప్రక్రియను కొనసాగించాలి ఎందుకంటే ఇది ఒకసారి మన జిల్లాలోని పశువులకు వచ్చిందంటే సుమారుగా 50 నుంచి 100% పశువులకు సోకుతుంది,ఆ సోకిన పశువుల్లో సుమారుగా ఒక శాతం పశువులు మరణించడానికి ఆస్కారం ఉంది కానీ ఇటీవల రాజస్థాన్ రాష్ట్రంలో సుమారుగా 10% పశువులు మరణించడం జరిగింది కాబట్టి రైతు సోదరులు లంపి స్కిన్ డిసీస్ పైన అవగాహన కలిగి ఉండాలి.