రైతు బాంధవుడు సీఎం కేసీఆర్

జనం సాక్షి /కొల్చారం మండలం రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసి సీఎం కేసీఆర్ రైతు బాంధవునిగా నిలిచిపోతాడని పోతంశెట్టిపల్లి సర్పంచ్ నాగరాణి నర్సింలు అన్నారు కుతంశెట్టిపల్లి గ్రామ ప్రజలు యువకులు బుధవారం రోజు సర్పంచ్ నర్సింలు నాగరాణి ఆధ్వర్యంలో కౌడిపల్లి ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్లి శాలువాతో సన్మానం చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రైతుల కోసం రైతుబంధు, రైతు భీమా పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు . రైతులంతా సీఎం కేసీఆర్ కు అండగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగరాణి నర్సింలు రాంపూర్ సర్పంచ్ రామ్ రెడ్డి సంతు మహేష్ తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు