Wednesday, 4 November 2026

రైతు రుణమాఫీపై అన్నదాతలు హర్షం-వెల్చల్ దుర్గం చెరువు ఎంపిటిసి కుశల్ కుమార్

 

మోమిన్ పేట ఆగస్టు 7 జనం సాక్షి/
రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసి సీఎం కేసీఆర్ రైతు బాంధవునిగా రైతుల మదిలో చిరకాలం నిలిచిపోయాడని వెల్చాల్ దుర్గం చెరువు ఎంపిటిసి కుశాల్ కుమార్ అన్నారు సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రైతుల కోసం రైతుబంధు, రైతు భీమా పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. రైతులంతా సీఎం కేసీఆర్ కు అండగా నిలవాలని అన్నారు. దేశంలోని ఎక్కడ లేని విధంగా రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటిని పకడ్బందీగా అమలు పరుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే ఆదర్శమని అన్నారు ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గెలవడం ఖాయమని ప్రజా సంక్షేమ పథకాలు బి ఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్షగా నిలుస్తాయన్నారు