ఆత్మహత్య చేసుకున్న గృహిణి
హైదరాబాద్,ఆగస్ట్28 (జనంసాక్షి): రెండు వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఫ్యాబ్ సిటీ గేట్ ముందు కంటైనర్ లారీ-బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడిని అమనగల్ మండలం చుక్కాపూర్ పాతకోట తండా గ్రామానికి చెందిన పాతలవత్ వెంకటేశ్‌గా గుర్తించారు. హైదరాబాద్ నుంచి తిరిగి వెళ్తుండగా ఫ్యాబ్ సిటీలోంచి వచ్చిన కంటైనర్ ఢీకొట్టడంతో సంఘటనా స్థలంలోనే అతను మృతిచెందాడు. పహాడిషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరోక ఘటనలో జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం తమ్మడపల్లిలో కిరోసిన్ పోసుకుని నూక రాధిక అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే ఇందుకు కారణంగా ప్రాథమిక సమాచారం.




