రాహుల్‌ను ఆహ్వానిస్తామన్న షబ్బీర్ అలీ
హైదరాబాద్,ఆగస్టు 21(జనం సాక్షి): సెప్టెంబర్ మొదటి వారంలో తెలంగాణలో బస్సుయాత్ర ఉంటుందని కాంగ్రెస్ నేత,ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో బస్సు యాత్ర త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించామని తెలిపారు. బస్సు యాత్రలో పాల్గొనేందుకు రాహుల్‌గాంధీని ఆహ్వానిస్తామని చెప్పారు. అలాగే యాత్ర ముగింపు రోజున సోనియాగాంధీరావాలని అధిష్టానాన్ని కోరతామన్నారు. ఇందులో టిఆర్‌ఎస్ అక్రమానలు ప్రజలకు వివరిస్తామని అన్నారు. అన్ని అంశాలపైనా ప్రజలకు వెల్లడిస్తామని అన్నారు. యాత్ర కోసం సబ్ కమిటీ, ప్రిపరేషన్ కమిటీ వేస్తున్నామన్నారు. దామోదర్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ , బలరాం నాయక్, సంపత్‌లతో పాటు ఇంకా కొందరు సభ్యులుగా ఉంటారన్నారు. ఈ కమిటీ సభ్యులు రూట్ మ్యాప్ ్గ/నైల్ చేస్తారని షబ్బీర్ అలీ వెల్లడించారు.




