Wednesday, 4 November 2026

వర్షం ప్రమాద స్థితిపై సమాచారం ఇవ్వండి – దుబ్బాక మున్సిపల్ చైర్ పర్సన్ సూచన.

జనం సాక్షి దుబ్బాక. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల ప్రజలకు తెలియజేయునది ఏమనగా, భారీ వర్షాల కారణంగా ఎక్కడైనా, ఎవరికైనా పాత ప్రమాదకరమైన ఇండ్లలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే తగిన సహాయం కోసం వెంటనే 6300 315 880,  9885356423లకు ఫోన్ చేయండి. స్థానిక వార్డు కౌన్సిలర్కు గాని, నాకు గాని ఫోన్ ద్వారా తెలియజేస్తే అందుబాటులో ఉన్న సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తాము. అధికార యంత్రాంగం అంతా అందుబాటులోనే ఉంటుంది. గమనించగలరని మనవి చేస్తున్నాను.                      గన్నె వనితా భూంరెడ్డి,చైర్ పర్సన్.