వర్షాల ముంపు ఇండ్లను పరిశీలించిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ బృందం..
బోనగిరి టౌన్ జనం సాక్షి
తెలంగాణ దళిత కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు నాగరిగారి ప్రీతం ఆదేశానుసారం
భారీ వర్షాలతో వరదలతో ముంపుకు గురైన భువనగిరి పట్టణంలోని శివానగర్ కుమ్మరివాడ ప్రాంతానికి సంబంధించిన ఇండ్లను ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం అధ్యక్షులు దర్గాయి హరిప్రసాద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ బృందం పరిశీలించి బాధితుల నుంచి వివరాలు సేకరించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి నిత్యవసర సరుకులు బియ్యం పంపిణీ చేయడం జరిగింది అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం అధ్యక్షులు దర్గాయి హరిప్రసాద్ మాట్లాడుతూ భారీ వర్షాలతో వరదలతో నష్టపోయిన బాధితులు రైతులను గృహ యజమానులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోకుండా పట్టించుకోనట్లు వ్యవహరించడం సిగ్గుచేటని వెంటనే వరదలు వర్షాలతో నష్టపోయిన రైతులకు గృహ యజమానులకు ప్రజలకు వెంటనే నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పులిగిల్ల బాలయ్య, కొండాపురం గణేష్, కొల్లూరి రాజు, వడిచర్ల శరత్ యాదవ్, ప్రశాంత్, సురేష్, ఎల్లారెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు