విద్యార్థులకు అభ్యాసన సామాగ్రి పంపిణీ

సెప్టెంబర్ 25, సారంగాపూర్, జనం సాక్షి…, మండలంలోని అడెల్లి గ్రామ సర్పంచ్ సముద్రాల సుచరిత-రాజేశ్వర్ రావు దంపతుల కుమారుడు రాహుల్ రావు ప్రథమ వర్ధంతి సందర్బంగా అడెల్లితండా పాఠశాల విద్యార్థులకు వారు అభ్యాసన సామాగ్రి నోటుబుక్స్, పెన్సిల్స్, పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుచరిత,ప్రధానోపాధ్యాయులు కాలేరి రవీందర్, నాయకులు రాజేశ్వర్ రావు, పురుషోత్తం రావు, జాదవ్ ప్రేమసింగ్, జాదవ్ రాజేష్, జాదవ్ జ్ఞానేశ్వర్, సాయి, విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.