విద్యా వ్యవస్థను పటిష్ట పరచండి
టేకులపల్లి, ఆగస్టు 4( జనం సాక్షి): ఆశ్రమ, గురుకుల పాఠశాలలో విద్యావ్యవస్థను పటిష్ట పరచాలని ఐటీడీఏ భద్రాచలం ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్ ని గిరిజన నాయకులు శివ నాయక్, నాగేంద్ర నాయక్ లు కలిసి కోరారు. శుక్రవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పిఓని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాల,గురుకులం లో విద్య వ్యవస్థను కటినంగా అమలు చేయాలని, టెండర్ లలో జరిగిన అవకతవకల గురించి ప్రాజెక్ట్ అధికారికి వివరించారు. సానుకూలంగా స్పందించిన పిఓ విద్యావ్యవస్థతోపాటు ఆదివాసీ గిరిజనులుకు ఐటీడీఏ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందే విధంగా కృషి చేస్తానని అన్నారని తెలిపారు. పి ఓ ని కలిసిన వారిలో రాందాస్ నాయక్ , కోటి , రామ్ కిషోర్ తదితరులు ఉన్నారు.