వినాయక నిమజ్జనానికి తగు ఏర్పాట్లు…

పనులను పరిశీలించిన స్థానిక సర్పంచ్ బట్టు శ్రీనివాస్, ఎస్ఐ రమేష్ బాబు

కేసముద్రం సెప్టెంబర్ 8 జనం సాక్షి /శుక్రవారం జరగబోయే గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో మన ఊరి పెద్దయి చెరువు లో వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని చేసుకునే విధంగా, అందుకు తగిన ఏర్పాట్లను మన స్థానిక సర్పంచ్ బట్టు శ్రీనివాస్, స్థానిక ఎస్సై రమేష్ బాబు,పాలకవర్గం చెరువు వద్ద పనులను పర్యవేక్షిస్తూ అందుకు తగు సూచనలు ఇచ్చారు. కావున కేసముద్రం స్టేషన్ ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ మన ఊరు చెరువులోనే మన గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసుకోవాల్సిందిగా వారు తెలియపరిచారు.