విలేకర్ల సమస్యలు పరిష్కారానికి కృషి-

ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.
నేరడిగొండసెప్టెంబర్11(జనంసాక్షి):
పాత్రికేయులు వివిధ రకాల పత్రికల్లో ప్రతినిధిగా పనిచేస్తున్న పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు.  ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు స్వగృహంలో ఆదివారం రోజున నేరడిగొండ మండల నూతన ప్రెస్ క్లబ్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. పాత్రికేయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి విన్నవించారు.ఆయన సానుకూలంగా స్పందించి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతినిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి మద్య వారదులుగా నిరంతరం సేవలందిస్తున్న పత్రిక రంగ పాత్రికేయుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొప్పుల ప్రమోద్ గౌరవ అధ్యక్షులు పసియోద్దీన్ ఉపాధ్యక్షులు ఏలేటి సృజన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి జాధవ్ రామారావు రాథోడ్ అజయ్ అజార్ దేవేందర్ పొతన్న గంగయ్య మదన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.