– వెంకటేష్ (మద్దూరు మండలం)

యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు*
=============================
మద్దూర్ (జనంసాక్షి):-నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నందిగామ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శనివారం రోజు సాయంత్రం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు. యాదవ సోదరులు శ్రీకృష్ణుడు విగ్రహాన్ని గ్రామంలో ఊరేగిస్తూ అనంతరం గ్రామపంచాయతీ దగ్గరకు చేరుకొని విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం ఉట్టి కొట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను గ్రామంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.. ఈ కార్యక్రమంలో యాదవ సోదరులు, యువకులు,గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.