వెల్లివిరిసిన తెలంగాణ జాతీయ సమైక్యత

మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు
మేడిపల్లి – జనంసాక్షి
తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మేడ్చల్ జిల్లాలో కార్మికశాఖామాత్యులు చామకూర మల్లారెడ్డి, కలెక్టర్ హరీష్ ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలోని సిఎంఆర్ కాలేజ్ జంక్షన్ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సమైక్యతను చాటేలా విద్యార్థులు, ప్రజాప్రతినిధులు నృత్య ప్రదర్శనలు, జాతీయ జెండాలతో చేతపట్టి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వందేమాతరం, జై తెలంగాణ నినాదాలతో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, తెరాస అధ్యక్షులు మంద సంజీవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ,డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్, కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, సుమన్ నాయక్, కో అప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, యువజన విభాగం, మేడ్చల్ లోని పలు మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.