Monday, 2 November 2026

వేధింపులు భరించలేక నవవధువు ఆత్మహత్య

హైదరాబాద్‌,అక్టోబర్‌29(జనం సాక్షి ): అంబర్‌పేటలోని బాపునగర్‌లో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అత్తమామలు, భర్త వేధింపులు భరించలేక మొబీన్‌ బేగం అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మొబీన్‌కు నెల రోజుల క్రితమే వివాహమైంది. అయితే అత్తింటి వారి వేధింపులు భరించలేక ఇటీవలే ఆమె పుట్టింటికి వచ్చింది. పుట్టింట్లోనే ఉరేసుకుని మొబీన్‌ ఆత్మహత్య చేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మొబీన్‌ ఆత్మహత్యపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.