సందర్శకులకు అనుమతి నిరాకరణ
హైదరాబాద్,ఆగస్ట్8(జనం సాక్షి): ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శంషాబాద్ అంతర్ఆజతీయ విమానాశ్రయంలో రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఏటా ఇక్కడ పక్షం రోజులపాటు ఆంక్షలు విధించి సందర్శకులను నియంత్రిస్తారు. బుధవారం నుంచి 20వ తేదీ వరకు శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా భద్రతా పెంచారు. అలాగేసందర్శకులకు కూడా అన్ని రకాల పాసులను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎయిర్ పోర్టుకు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా సోదాలు చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు. ప్రయాణీకులు, సందర్శకులు తనిఖీలకు సహకరించాల్సిందిగా అధికారులు కోరారు. అలాగే సందర్శకులకు లోనికి అనుమతి ఉండదు.




