జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని శివ్వంపేట అక్టోబర్ 20 జనంసాక్షి: నేటి సమాజంలో విద్యార్థులకు చదువుతోపాటుగా క్రీడలు అవసరమేనని క్రీడలు మానసిక స్తైర్యానికి శరీర దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పేర్కొన్నారు. తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి, సీఐ శ్రీధర్, స్థానిక ఎస్ఐ రవికాంత్ రావు నేతృత్వంలో పోలీస్ అమర వీరుల సంస్మరణార్థం మండల కేంద్రమైన శివ్వంపేటలోనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో గురువారం నిర్వహించిన తాలూకా స్థాయి వాలీబాల్ పోటీలను జిల్లా ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని సర్వీస్ చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదివితేనే వారు అనుకున్న గమ్యాన్ని చేరుకునే అవకాశం దక్కుతుందని ఆమె అన్నారు. తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మొదటగా వినడం అలవాటు నేర్చుకోవాలని తద్వారా వారికి అన్ని విషయాలు అర్థమవుతాయని, ఇప్పుడు వింటున్న మాటలు భవిష్యత్తులో వారికి ఎంతో ఉపయోగపడతాయనీ ఆయన అన్నారు. విద్యార్థులు టీవీలు, సెల్ ఫోన్లను పూర్తిగా దూరం పెట్టాలని అప్పుడే వారికి చదువు పట్ల పూర్తి శ్రద్ధతో ఉంటారని ఆయన అన్నారు. అమర పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శివ్వంపేటలో నిర్వహించే వాలీబాల్ పోటీలలో 45 జట్లు తలపడనున్నాయనీ క్రీడలలో పాల్గొంటున్న క్రీడాకారులకు పోలీస్ శాఖ తరుపున శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆయన అన్నారు. శివ్వంపేట పీఈటీ ఆంజనేయులు సహకారంతో క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ సీఐ శ్రీధర్, శివ్వంపేట ఎస్ఐ రవికాంత్ రావు,తూప్రాన్ ఎస్ఐ సురేష్ కుమార్, మాజీ సర్పంచ్ పులిమామిడి స్రవంతి నవీన్ గుప్త, ఉప సర్పంచ్ పద్మ వెంకటేశ్, ఎచ్ఎం నారాయణమ్మ, విద్యా కమిటీ చైర్మన్ రాజీపేట నర్సిములు, కొడకంచి రవీందర్ గౌడ్, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు,ఉపాద్యాయ బృందం,విద్యార్థులు,క్రీడాకారు లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
శరీర దృఢత్వానికి క్రీడల దోహదం




